పాతబస్తీ వాసులకు శుభవార్త.. ఫలక్‌నూమా దాకా మెట్రో!
- ఎంజీబీఎస్ వరకే మెట్రో సదుపాయం
- పాతబస్తీకి విస్తరించని మెట్రో
- ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా దాకా మెట్రో
- 5.5 కిలోమీటర్ల రూటుకు రూ.500 కోట్ల కేటాయింపు
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి మాదిరే సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేసిన హరీశ్ రావు.. పలు కొత్త అంశాలపైనా దృష్టి సారించారు. ములుగులో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ.100 కోట్ల విడుదల ఇలాంటిదే. మరి హరీశ్ బడ్జెట్‌లో భాగ్య నగరి వాసులకు ఎలాంటి కేటాయింపులు ఉన్నాయన్న విషయంపై ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో వచ్చాక నగరంలో ప్రయాణం రూపులేఖలే మారిపోయాయని చెప్పాలి. నగరమంతా విస్తరించకున్నా.. మెట్రో నడిచే రూట్లలో ప్రయాణం బాగానే మారిపోయింది. అయితే పాతబస్తీలోకి ఈ మెట్రో ఇప్పటిదాకా అడుగు పెట్టనే లేదనే చెప్పాలి. అయితే పాతబస్తీకి కూడా మెట్రో సదుపాయాన్ని విస్తరించేలా హరీశ్ రావు తన బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా దాకా 5.5 కిలో మీటర్ల మేర మెట్రో విస్తరణకు ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించింది.