ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జీవో జారీ... పూర్తి వివరాలు ఇవిగో!
- ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు
- కనిష్ఠంగా రూ.20
- గరిష్ఠంగా రూ.250
- ప్రాంతాల వారీగా టికెట్ల ధరల నిర్ణయం
ఇప్పటివరకు పాత జీవో ప్రకారం ఏపీలో సినిమా టికెట్ల ధరలు కొనసాగాయి. అయితే, రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నేడు కొత్త జీవో జారీ చేసింది. దీని ప్రకారం ఏపీలోని థియేటర్లలో గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20లకు టికెట్లు లభించనున్నాయి. థియేటర్లు ఉండే ప్రాంతాలను బట్టి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలుగా విభజించి టికెట్ల ధరలను నిర్ణయించారు.
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో...
మున్సిపాలిటీల్లో...
నగర పంచాయతీలు-గ్రామ పంచాయతీల్లో...
ఈ టికెట్ల ధరలకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. అంతేకాదు, భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇది రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు వర్తిస్తుంది. అయితే ఏపీ సర్కారు ఇక్కడో షరతు విధించింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చిన్న సినిమాలు ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.
.
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో...
- నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.60, నాన్ ప్రీమియం టికెట్ రూ.40
- ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.
- స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100
- మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250
మున్సిపాలిటీల్లో...
- నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.50, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30
- ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.80, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60
- స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80
- మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250
నగర పంచాయతీలు-గ్రామ పంచాయతీల్లో...
- నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20
- ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50
- స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70
- మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.