హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్
- తెలంగాణకు వరుసగా పెట్టుబడులు
- కేటీఆర్ సమక్షంలో జరిగిన ఒప్పందం
- హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటు
- ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేసిన మంత్రి
తెలంగాణకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థలైన చాలా కంపెనీలు తమ యూనిట్లను తెలంగాణలో ఏర్పాటు చేశాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆ సంస్థకు సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. ఈ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.