ఈ నెల 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- బీఏసీ సమావేశం నిర్ణయం
- ఆదివారం మాత్రమే సెలవు
- మొత్తంగా 7 రోజుల పాటు సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 దాకా కొనసాగనున్నాయి. ఈ మేరకు కాసేపటి క్రితం ముగిసిన తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సంప్రదాయానికి భిన్నంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ దఫా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాలు ప్రారంభం కాగానే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టారు.
హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, అందుకు అవసరమయ్యే సమయాన్ని బేరీజు వేసుకున్న ప్రభుత్వం... ఈ నెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాడు (8వ తేదీ మంగళవారం)తో పాటు ఈ నెల 13వ తేదీన ఆదివారం మాత్రమే సెలవుగా ప్రకటించారు. ఇక ఈ నెల 15 వరకు అంటే.. 7 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయన్న మాట.