ఇదేం మంచి పద్ధతి కాదు... అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ అసహనం
- ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ సభ్యులు
- బీఏసీ సమావేశంలో సీఎం జగన్ ఆగ్రహం
- గతంలో ఈ సంస్కృతి లేదని వ్యాఖ్యలు
- గవర్నర్ వయసుకు విలువ ఇవ్వాలని హితవు
ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితులపై సీఎం జగన్ బీఏసీ సమావేశంలో చర్చించారు. శాసనసభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం కొనసాగుతుండగా, టీడీపీ సభ్యులు ప్రసంగం ప్రతులను చించివేసి, నినాదాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
గవర్నర్ ను దూషించడం, ప్రసంగం ప్రతులు చించి గవర్నర్ పై వేయడం ఏంటని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ అసహనం ప్రదర్శించారు. ఇదేం మంచి పద్ధతి కాదని, గతంలో ఇలాంటి ధోరణులు లేవన్న విషయాన్ని టీడీపీ సభ్యులు గుర్తెరగాలని హితవు పలికారు. కనీసం గవర్నర్ వయసును దృష్టిలో ఉంచుకుని అయినా ఆయనకు సభలో గౌరవం ఇవ్వాలని సూచించారు.