అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య

  • అధిక జ్వరం, తల తిరుగుడు లక్షణాలు
  • ఆసుపత్రిలో డాక్టర్ తో ఉన్న ఫొటో షేర్
  • మహిళా దినోత్సవం ముందు మహిళా డాక్టర్ ను కలుసుకోవడం పట్ల  సంతోషం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పోస్ట్ కోవిడ్ అనారోగ్యంతో మరోసారి సోమవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఐశ్వర్య కరోనా బారిన పడడంతో ఫిబ్రవరి 1న హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగింది. చికిత్సతో కోలుకోవడంతో ఆమె డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ముసాఫిర్ అనే మ్యూజిక్ వీడియో షూటింగ్ పనుల్లో బిజీగా ఉండిపోయారు. 

‘‘కరోనాకు ముందు.. కరోనా తర్వాత జీవితం. అధిక జ్వరం, తల తిరగడం లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరాను’’ అంటూ ఐశ్వర్య ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. పక్కన డాక్టర్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఎంతో స్ఫూర్తి నీయమైన, గొప్ప మహిళా డాక్టర్ ప్రీతికా చారిని కలవడం, ఆమె తనకు సమయం వెచ్చించడం గర్వంగా ఉందని పోస్ట్ లో పేర్కొన్నారు. 

‘‘మిమ్మల్ని కలుసుకోవడం ద్వారా మహిళా దినోత్సవాన్ని ప్రారంభించడం గొప్పగా ఉంది. ఇది నాకు గర్వకారణం’’ అని ఐశ్వర్య ప్రకటించారు. ఇదిలావుంచితే, ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్టు జనవరి 17న ప్రకటించి అభిమానులను షాక్ కు గురి చేయడం తెలిసిందే.


More Telugu News