చరిత్రలో అత్యంత కనిష్ఠానికి పడిపోయిన రూపాయి

  • 129 డాలర్లకు బ్యారెల్ ముడి చమురు ధర
  • చమురు ధరలు పెరగడంతో బలపడిన డాలర్
  • దీంతో 76.98కి పతనమైన రూపాయి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.

డాలర్ తో 76.85 వద్ద ట్రేడింగ్ మొదలు కాగా, 76.98 వరకు పడిపోయింది. శుక్రవారం ముగింపు 76.16గా ఉంది. 81 పైసలకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. క్రితం ట్రేడింగ్ సెషన్ లోనూ రూపాయి 23 పైసలు నష్టపోవడం గమనార్హం. 

చమురు ధరలు పెరగడంతో దానికి తగినట్టుగా డాలర్ కూడా బలపడినట్టు రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన భారం పడుతుంది. డాలర్లకు డిమాండ్ ఏర్పడి రూపాయి విలువ తగ్గుతుంది.


More Telugu News