తెలంగాణ బడ్జెట్ 2,56,958 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ - 1

  • దళితబంధుకు రూ. 17,700 కోట్లు
  • పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేలా బడ్జెట్ ను తయారు చేశామని చెప్పారు. 

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

  • రాష్ట్ర బడ్జెట్ - రూ. 2,56,958 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ. 1,89,274.82 కోట్లు
  • క్యాపిటల్ వ్యయం -  రూ. 29,728.44 కోట్లు
  • దళితబంధుకు - రూ. 17,700 కోట్లు
  • దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి. అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు రికార్డు సృష్టించింది. 
  • పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
  • రూ. 75 వేల లోపు పంట రుణాల మాఫీ
  • రూ. 50 వేల లోపు రైతు రుణాలు ఈ నెల చివరిలోపు మాఫీ 
  • ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 2,750 కోట్లు
  • ఆసరా పింఛన్ కోసం రూ. 11,728 కోట్లు
  • డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు రూ. 12,000 కోట్లు
  • మన ఊరు - మన బడి కార్యక్రమానికి రూ. 7,289 కోట్లు
  • హరితహారం పథకానికి రూ. 932 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 1,542 కోట్లు
  • పామాయిల్ సాగుకు రూ. 1,000 కోట్లు
  • తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు. కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1,000 కోట్లు. రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం. 


More Telugu News