'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఖరారు!

  • ప్రేమకథా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి'
  • నాగశౌర్య జోడీగా కొత్త హీరోయిన్ 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • ఏప్రిల్ 22వ తేదీన విడుదల   
నాగశౌర్య కథానాయకుడిగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమా రూపొందింది. నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయికగా పరిచయమవుతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, రిలీజ్ డేట్ తో కూడిన అధికారిక పోస్టర్ ను వదిలారు. చూస్తుంటే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ అనే విషయం అర్థమవుతోంది. కృష్ణ .. వ్రింద .. విహారి అనే మూడు పాత్రల మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. 

ఇటీవల కాలంలో నాగశౌర్యకి హిట్ పడలేదు. 'వరుడు కావలెను' .. 'లక్ష్య' ఈ రెండు సినిమాలు కూడా పరాజయాలను చవిచూశాయి. ఈ సినిమాతో మాత్రం తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.


More Telugu News