అసెంబ్లీ నుంచి ఈటల, రఘునందన్, రాజాసింగ్ సస్పెన్షన్
- తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
- సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
- ఈ సెషన్ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని వివరణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు అసెంబ్లీలో నినాదాలు చేశారు. దీంతో సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆ ముగ్గురు సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని చెప్పారు. తమను ఎంతగా అణచివేయాలనుకున్నా తాము అంతగానూ ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.