నితిన్ సినిమా కోసం రంగంలోకి ఊర్వశి రౌతేలా!
- బాలీవుడ్ క్రేజీ బ్యూటీగా ఊర్వశి రౌతేలా
- 'మాచర్ల నియోజక వర్గం' కోసం సంప్రదింపులు
- మాస్ ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్
- ఏప్రిల్ 29వ తేదీన విడుదల
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకి యూత్ లో ఒక రేంఙ్ లో క్రేజ్ ఉంది. సినిమాల ద్వారా కంటే కూడా ఈ సుందరి సోషల్ మీడియా ద్వారా ఎక్కువమంది అభిమానులను పెంచుకుంది. ఫలానా తెలుగు సినిమాలో ఈ అమ్మడి ఐటమ్ ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయిగానీ అవేవీ కార్యరూపాన్ని దాల్చలేదు.
కానీ ఈ సారి ఈ వార్తలు నిజమవుతున్నాయని అంటున్నారు. నితిన్ కథానాయకుడిగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి కనువిందు చేయనుంది.
ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ ఒక మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ను సిద్ధం చేశాడట. ఈ పాట కోసమే ఊర్వశి రౌతేలాను రంగంలోకి దింపనున్నారని అంటున్నారు. ఈ ఐటమ్ సాంగ్ మాస్ ను .. యూత్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నితిన్ కి, ఏప్రిల్ 29న రానున్న ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.