షేన్ వార్న్ మృతిని అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకునేందుకు నిరాకరించిన థాయ్ లాండ్ పోలీసులు
- లెజెండరీ క్రికెటర్ వార్న్ ఆకస్మిక మరణం
- థాయ్ లాండ్ లో గుండెపోటుతో మృతి
- వార్న్ గదిలో రక్తపు మరకలు
- వార్న్ దగ్గుతూ రక్తపు వాంతులు చేసుకున్నాడన్న పోలీసులు
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ థాయ్ లాండ్ విహారయాత్రంలో హఠాన్మరణం పాలవడం తెలిసిందే. కోహ్ సముయ్ దీవిలోని ఓ విల్లాలో వార్న్ గుండెపోటుతో కన్నుమూశాడు. కాగా, వార్న్ మృతదేహాన్ని నేడు పోస్టుమార్టంకు తరలించారు.
అటు, వార్న్ గదిలో రక్తపు మరకలు ఉన్న విషయం వెల్లడైంది. వార్న్ తన గదిలో అచేతనంగా పడివున్నట్టు గుర్తించిన అతడి స్నేహితులు సీపీఆర్ చేశారని, ఆ సమయంలో వార్న్ దగ్గుతూ రక్తం కక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీన్ని అనుమానాస్పద మరణంగా నమోదు చేయబోమని వారు స్పష్టం చేశారు. వార్న్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆస్ట్రేలియా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్న్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ఆస్ట్రేలియా సర్కారు నిర్ణయించింది.