సికింద్రాబాద్ గణపతి ఆలయంలో భక్తుడిపై పూజారి దాడి... వీడియో ఇదిగో!

సికింద్రాబాద్ గణపతి ఆలయంలో భక్తుడిపై పూజారి దాడి... వీడియో ఇదిగో!
  • దైవదర్శనానికి వచ్చిన ఉప్పల్ భక్తుడు
  • ఉప ఆలయాల సందర్శనకు యత్నం
  • అడ్డుకున్న పూజారి
  • అనుమతి లేదంటూ ఆగ్రహం
దైవదర్శనానికి వచ్చిన ఓ భక్తుడిపై పూజారి రౌద్రరూపం ప్రదర్శించిన ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. ఉప్పల్ కు చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాద్ లోని గణపతి ఆలయానికి వచ్చాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం... అక్కడే ఉన్న ఉప ఆలయాలను సందర్శించే ప్రయత్నం చేశాడు. అయితే, పూజారి ప్రభాకర్ శర్మ అందుకు అడ్డుచెప్పాడు. అనుమతి లేకుండా ఎలా వెళతావంటూ ఆ భక్తుడిపై ప్రభాకర్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అంతేకాదు, ఆ భక్తుడిపై దాడి చేయగా, ఈ భక్తుడు కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ గణపతి ఆలయంలోని సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. ఈ ఘటనపై సదరు భక్తుడు పూజారి ప్రభాకర్ శర్మపై ఆలయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. పూజారి ప్రవర్తనపై దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిస్తామని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ ఘటన రెండ్రోజుల కింద జరిగినట్టు తెలుస్తోంది.


More Telugu News