పోలెండ్ నుంచి జెలెన్ స్కీ పాలన... ఆ మేరకు అమెరికా ఏర్పాట్లు!
- కీవ్ పై రష్యా ముమ్మరదాడులు
- జెలెన్ స్కీకి ప్రవాసం తప్పదని సర్వత్రా అభిప్రాయాలు
- ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అమెరికా
- ఉక్రెయిన్ కు 10 బిలియన్ డాలర్లు ఇవ్వాలన్న అమెరికా కాంగ్రెస్
ఉక్రెయిన్ పై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. గత వారం రోజులకుపైగా చేస్తున్న దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. వైమానిక దాడులతోనూ ఉక్రెయిన్ కీలక నగరాలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు నగరాలను రష్యన్ సేనలు ఆక్రమించుకోగా, కీవ్ కూడా వారి చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ అదే జరిగితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ, ఇతర మంత్రివర్గానికి ప్రవాసం ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. పొరుగునే ఉన్న పోలెండ్ దేశం నుంచి జెలెన్ స్కీ పరిపాలన కొనసాగించేందుకు వీలుగా అమెరికా పావులు కదుపుతోంది.
యుద్ధం ఇప్పట్లో ముగియడం కష్టమని భావిస్తున్న అమెరికా... ఉక్రెయిన్ సైనికుల్లోనూ, ప్రజల్లోనూ జెలెన్ స్కీ స్ఫూర్తిని నింపడం అత్యవసరం అని భావిస్తోంది. యుద్ధం సుదీర్ఘకాలం సాగవచ్చని, ప్రవాసం తప్పేట్టు లేదని, జెలెన్ స్కీ పాలన కొనసాగడం అనేది ఎంతో ముఖ్యమైన అంశమని తలపోస్తోంది. కీవ్ ను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉండడంతో అమెరికా ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది.
కాగా, ఉక్రెయిన్ కు ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పథం కింద అందించే సాయంతోపాటు ఆయుధ సాయం కూడా చేయాల్సి ఉందని, అందుకోసం 10 బిలియన్ డాలర్ల సాయం కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ ను అధ్యక్షుడు బైడెన్ కోరారు. ఉక్రెయిన్ సుదీర్ఘకాలం పాటు రష్యాను ఎదుర్కోవాలంటే బయటి నుంచి ఆయుధసాయం తప్పనిసరి అని అభిప్రాయపడ్డాయి.