టికెట్ కొని పుణె మెట్రో రైలు ఎక్కిన ప్రధాని మోదీ
- పుణె మెట్రోరైలు ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
- అనంతరం గార్వేర్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు ప్రయాణం
- ప్రయాణ సమయంలో విద్యార్థులతో ముచ్చట్లు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన ఆయన మెట్రో రైలులో గార్వేర్ నుంచి ఆనంద్ నగర్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ప్రధాని వెంట విద్యార్థులు కూడా ఉన్నారు. రైలులో తన పక్కన కూర్చున్న విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు.
పుణె మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం నిడివి 32.2 కిలోమీటర్లు కాగా, తొలి దశ కింద 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. వనజ్ నుంచి గార్వేర్ కాలేజ్ మెట్రో స్టేషన్ వరకు.. అలాగే, పీసీఎంసీ నుంచి ఫుగెవాడి మెట్రో స్టేషన్ వరకు రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు నడవనున్నాయి.
ప్రధాని పర్యటన గురించి ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. ‘పుణె ప్రజలకు అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇది భరోసానిస్తుంది’అంటూ ట్వీట్ చేసింది. పర్యటన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.