మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? మీరు సల్లంగుండాలి: షర్మిల
- రుణమాఫీ చెయ్యడం లేదని రాజీనామా చేస్తారా?
- పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా?
- రాష్ట్రం రావణకాష్టం కావాలి
- అంతే కదా మీ అద్భుత పాలన
తెలంగాణ కంటే బెటర్ పథకాలు చూపిస్తే రాజీనామా చేస్త అంటూ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
''రుణమాఫీ చెయ్యడం లేదని రాజీనామా చేస్తారా? రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయట్లేదని రాజీనామా చేస్తారా? నష్టపోయిన రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తలేరని రాజీనామా చేస్తారా? రైతు బీమా రైతులందరికి అందిస్తలేరని రాజీనామా చేస్తారా? కౌలు రైతును రైతుగానే గుర్తిస్తలేరని రాజీనామా చేస్తారా?
నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, యువతను నిరుద్యోగానికి బలిచేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అని మాట ఇచ్చి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నందుకు రాజీనామా చేస్తారా? పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని రాజీనామా చేస్తారా?
మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేదని రాజీనామా చేస్తారా? పేద విధ్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తలేరని రాజీనామా చేస్తారా? మీరెందుకు రాజీనామా చేస్తారు చిన్న దొరా? మీరు సల్లంగుండాలి. రాష్ట్రం రావణకాష్టం కావాలి. అంతే కదా మీ అద్భుత పాలన'' అని షర్మిల ఎద్దేవా చేశారు.