తనను బెదిరించిన జర్నలిస్టు పేరు చెప్పేసిన క్రికెటర్ సాహా
- బీసీసీఐ కమిటీకి వివరాలు తెలిపిన సాహా
- తనకు తెలిసిందంతా కమిటీకి చెప్పానని వివరణ
- మీడియాకు మాత్రం ఆ జర్నలిస్టు పేరు చెప్పని క్రికెటర్
టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను ఇంటర్వ్యూ కోసం ఒక జర్నలిస్టు బెదిరించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ సాహాను ఆరా తీసే ప్రయత్నాలు జరిపింది. తనని బెదిరించిన జర్నలిస్టు పేరును చెప్పబోనని సాహా మొదట అన్న విషయం తెలిసిందే. అలాగే, ఈ విషయం గురించి బీసీసీఐ తనను ఎలాంటి వివరాలూ అడగలేదని ఇటీవలే ఆయన చెప్పాడు.
చివరకు దీనిపై బీసీసీఐ వివరాలు అడగడంతో ఆయన ఆ జర్నలిస్టు పేరును తెలిపాడు. సాహా ఇటీవల చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు బోర్డు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆయన ట్వీట్ చేశాడు. తనకు తెలిసిందంతా కమిటీకి చెప్పానని, వివరాలను వాళ్లతో పంచుకున్నానని అన్నాడు.
తాను ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఇప్పుడు అందరికీ చెప్పలేనని అన్నాడు. మీడియాకు ఆ జర్నలిస్టు పేరు చెప్పలేదు. కాగా, ఆ జర్నలిస్టు పేరు ఎవరైనా అడిగినా చెప్పబోనని, ఒకవేళ చెబితే అతని కెరీర్ నాశనం అవుతుందని సాహా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.