ఉక్రెయిన్ పిలుపుతో కదిలిన 3 వేల మంది అమెరికా వలంటీర్లు
- 11వ రోజుకు చేరుకున్న యుద్ధం
- అంతర్జాతీయ బెటాలియన్‌లో సేవలు అందించేందుకు ముందుకు రావాలని ఉక్రెయిన్ పిలుపు
- తాము రెడీ అంటూ వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన వలంటీర్లు
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేడు 11వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని మారియుపోల్, వోల్నోవాఖా నుంచి పౌరులు తరలివెళ్లేందుకు రష్యా నిన్న కొన్ని గంటలపాటు కాల్పుల విరమణ ప్రకటించింది. ఆ సమయం ముగియగానే మళ్లీ బాంబుల వర్షం కురిపించింది. రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు మరిన్ని విమానాలను పంపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ నిన్న అమెరికాకు విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్ విజ్ఞప్తిపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించిన ఏ దేశమైనా తమతో సైనిక ఘర్షణలోకి వచ్చినట్టే భావిస్తామని హెచ్చరించారు. మరోవైపు, రష్యా దండయాత్రను అడ్డుకోవడంలో సాయపడే అంతర్జాతీయ బెటాలియన్‌లో సేవలు అందించేందుకు ముందుకు రావాలన్న ఉక్రెయిన్ పిలుపునకు 3 వేల మంది అమెరికన్లు స్పందించారు. అంతర్జాతీయ బెటాలియన్‌లో స్వచ్ఛందంగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారంతా తమను సంప్రదించినట్టు వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ ప్రతినిధి తెలిపారు.