ఓటమి భయంలో కేసీఆర్.. అందుకే ఈ ఆదేశాలంటున్న విజయశాంతి
- ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో రాములమ్మ జోరు
- ఇంటెలిజెన్స్‌కు ఆదేశాలు వెళ్లాయంటూ ప్రస్తావన
- బీజేపీ నేతలపై దాడులు, కేసులపై విసుర్లు
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రస్తుతం ఓటమి భయం పట్టి పీడిస్తోందని బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇస్తున్న ఆదేశాలను బట్టి చూస్తుంటే.. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా కేసీఆర్‌లో ఓటమి భయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కాసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా పోస్ట్ చేసిన పలు ట్వీట్లలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందనడానికి ఇదే సాక్ష్యమంటూ ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, కేసులూ పెడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. తప్పుడు కేసులతో కేసీఆర్ తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సాధారణంగా రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగితేనే... సీఎంఓకు రిపోర్ట్ వెళ్లేదని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మండల స్థాయిలో జరిగే చిన్నపాటి ఆందోళనలు, నిరసనలతో పాటు రాజకీయ సమావేశాలపైనా రోజువారీ రిపోర్టులు పంపాలని ఇంటెలిజెన్స్‌తో పాటు ఆయా శాఖల అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని ఆమె అన్నారు. ఈ ఆదేశాలు చూస్తుంటేనే.. కేసీఆర్ ఎన్నికలంటే ఏ మేర భయపడుతున్నారో అర్థమవుతోందంటూ ఆమె ఎద్దేవా చేశారు.