రోడ్డు ప్రమాదంలో జనసైనికుడి మృతి... బీమా లేకపోయినా రూ.5 లక్షలు అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
- తవిటి వెంకటేశ్ ఇటీవల కన్నుమూత
- క్రియాశీలక సభ్యత్వం తీసుకోని వెంకటేశ్
- దాంతో బీమా సౌకర్యం లభించని పరిస్థితి
- పెద్ద మనసు ప్రదర్శించిన పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేశ్ జనసేన కార్యకర్త. వెంకటేశ్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. సాధారణంగా జనసేన కార్యకర్తలకు పార్టీ ఇటీవల క్రియాశీలక సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పించింది. దాంతో ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు బీమా సొమ్ము లభిస్తుంది.
అయితే, తవిటి వెంకటేశ్ పార్టీ తరఫున బీమా చేయించుకోలేదు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఔదార్యం ప్రదర్శించారు. వెంకటేశ్ కు బీమా లేకపోయినా, అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే చెక్కును అతడి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా జనసేన నేతల ద్వారా వెంకటేశ్ కుటుంబ పరిస్థితి విని పవన్ కల్యాణ్ చలించిపోయినట్టు తెలుస్తోంది.