రష్యా మాట తప్పుతోంది... ఆ నగరంలో దాడులు చేస్తోంది: ఉక్రెయిన్ ఆరోపణ

  • కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్న రష్యా
  • మరియుపోల్, వోల్నవోఖ్ నగరాల్లో పౌరుల తరలింపు
  • రష్యా కాల్పుల విరమణ ఉల్లంఘించిందన్న ఉక్రెయిన్
  • తరలింపు వాయిదా వేసినట్టు అధికారుల వెల్లడి
ఉక్రెయిన్ లోని మరియుపోల్, వోల్నవోఖ్ నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా కాల్పులు విరమిస్తున్నట్టు రష్యా ప్రకటించడం తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ఐదున్నర గంటల పాటు పాటిస్తామని రష్యా పేర్కొంది. అయితే రష్యా మాట తప్పుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియుపోల్ నగరంలో ఇప్పటికీ రష్యా సేనలు దాడులు చేస్తున్నాయని ఆరోపించింది. 

రష్యా బలగాలు చుట్టుముడుతుండడంతో పౌరుల తరలింపుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని మరియుపోల్ నగర అధికారులు చెబుతున్నారు. మరియుపోల్ నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ రష్యా బలగాలు కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దాంతో, పౌరులను ఖాళీ చేయించే కార్యాచరణను వాయిదా వేసుకున్నామని నగర అధికారులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.


More Telugu News