జనసేన ఆవిర్భావ సభకు అడ్డంకులు.. వారంలో నాలుగు వేదికలు మారాయన్న నాదెండ్ల మనోహర్!
- ఇప్పటంలో వేదికకు అనుమతినిచ్చిన రైతులు
- కాసేపటికే తమ భూముల్లో అనుమతివ్వలేమని చెప్పారు
- రాష్ట్రంలో అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం
- పవన్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారన్న మనోహర్
జనసేన ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నాలు మొదలెట్టగా..ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయట. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకునే నిమిత్తం మంగళగిరి మండల పరిధిలోని ఇప్పటం గ్రామ పరిసరాల్లో స్థలాన్ని పరిశీలించామని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.
తొలుత సదరు స్థలం యజమానులు జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకునేందుకు అంగీకరించగా.. కాసేపటికే సభకు తమ భూములను ఇవ్వలేమని, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారని ఆయన తెలిపారు. ఈ ఇబ్బందుల వెనుక ఉన్న శక్తులేవో తమకు తెలుసునని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా వేదిక స్థలం వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఒత్తిడి చేస్తోందో అర్ధం చేసుకోవచ్చని ఆయన ధ్వజమెత్తారు.
ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసిన నాదెండ్ల.. ఏపీలో సాగుతున్న పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ పోరాటంలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు.
జగన్ పాలనపై ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వంలో చాలా మంది అహంకారంతో పని చేస్తున్నారన్న ఆయన.. ప్రజలు నిండు మనస్సుతో 151 సీట్లు ఇస్తే.. పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.