కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు దర్శకుడు పీకే: మధుయాష్కీ వ్యాఖ్యలు
- టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తిన మధుయాష్కీ
- ఫ్రంట్ చిత్రానికి మోదీ నిర్మాత అని వ్యాఖ్యలు
- కేసీఆర్ ఇందులో నటుడు అని వెల్లడి
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే) అని వ్యాఖ్యానించారు. ఈ ఫ్రంట్ చిత్రానికి నిర్మాత నరేంద్ర మోదీ అయితే, కేసీఆర్ నటుడు అని వివరించారు.
మధుయాష్కీ అటు అధికారుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తమ పోరాటం సీఎంపైనే అని, అధికారులపై కాదని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులు జాగ్రత్తపడకపోతే మరో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మిలు అవుతారని పేర్కొన్నారు. అవినీతిలో ఏపీ అధికారి, బీహార్ అధికారి అని ఉండదని తెలిపారు. తెలంగాణ ఐఏఎస్ లకు పదవులు ఇచ్చేది సీఎం కాదా? అని వ్యాఖ్యానించారు. ఒక్కో అధికారికి అన్ని శాఖలు ఇచ్చిన సీఎంది తప్పు అని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.