'భీమ్లా నాయక్' ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందో తెలుసా?
- తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిక
- ఇప్పటి వరకు రూ. 170 కోట్ల వసూళ్లు
- రూ. 200 కోట్ల దిశగా పరుగులు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మోత మోగిస్తోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 170 కోట్లు వసూలు చేసింది. రూ. 200 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వివరాలను ట్రేడ్ అనలిస్ట్ విజయబాలన్ వెల్లడించారు. ఏపీలో టికెట్ ధరలు ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి. లేకపోతే ఇప్పటికే ఈ చిత్రం రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టేది.