తెలంగాణలో గూడు లేని పేదలు ఉండరాదన్నదే లక్ష్యం: కేటీఆర్
- విమర్శలు చేయడం కంటే పని చేయడమే కష్టం
- రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్ సరఫరా
- వెంకటాపూర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండరాదన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా ఆ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. అందులో భాగంగానే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని ఓ యజ్ఞంగా చేపట్టినట్టు ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్‌లో నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఈ రోజు ఆయన పేదలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై మండిపడుతూ, విమర్శలు చేయడం సులువేనని, పని చేయడమే కష్టమని ఆయన అన్నారు. రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయల మేర అభివృద్ధి జరుగుతున్నా.. విమర్శలకు కనిపించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కోతల్లేని విద్యుత్ ఉందని ఏ రైతును అడిగినా చెబుతారని కూడా కేటీఆర్ అన్నారు. ప్రజలకు అడిగే అవసరం లేకుండానే.. వారి అవసరాల మేరకు ముందే అన్నీ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.