టీఎస్సార్టీసీలో కొత్త పథకం.. ట్వీట్‌తో లీకిచ్కిన సజ్జనార్
- ఉమెన్స్ డే నాడు ఓ ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్
- అది ఎక్కడిదో చెప్పాలంటూ ప్రశ్న
- కొత్త పథకం వస్తోందని, వెయిట్ చేయాలంటూ ప్రకటన
ఖాకీ దుస్తుల్లో సత్తా కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్.. టీఎస్సార్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాక.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిత్యం వార్తల్లో ఉంటోంది. తన హయాంలో ఆర్టీసీలో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా దూసుకెళుతున్న సజ్జనార్ .. ఆర్టీసీలో త్వరలోనే ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా చెప్పారు.
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్ ... ఈ ఫొటో ఎక్కడిది? అంటూ ఓ పోల్ క్వశ్చన్ మాదిరిగా ట్వీట్ చేశారు. ఈ ఫొటోపై చాలా మంది స్పందిస్తూనే ఉండగా.. ప్రపంచ మహిళా దినోత్సవాన మహిళల కోసం.. ప్రత్యేకించి బాలికల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటిదేమైనా ప్రకటించనున్నారా? అంటూ ఓ నెటిజన్ అడిగారు. దీనికి సజ్జనార్ వెంటనే స్పందిస్తూ.. ఓ పథకాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే ప్రకటిస్తామంటూ సమాధానం ఇచ్చారు. ఆ కొత్త పథకం ఏమై ఉంటుందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.