కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు నారా లోకేశ్ లేఖ

  • చేనేత రంగం దుస్థితిలో ఉందంటూ వివరణ
  • వైసీపీ సర్కారు చిన్నచూపు చూస్తోందని ఆరోపణ
  • ఆదుకోవాలంటూ నిర్మలకు విజ్ఞప్తి
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. చేనేత రంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. కరోనా మహమ్మారి ప్రభావంతో చేనేత పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించారు. చేనేత పరిశ్రమను తిరిగి గాడినపెట్టేందుకు కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూడడం వల్ల చేనేత పరిశ్రమ కుదేలైందని ఆయన ఆరోపించారు. 


More Telugu News