రష్యాతో యుద్ధం చేయడానికి విదేశాల నుంచి తిరిగొచ్చిన 66 వేల మంది ఉక్రేనియన్లు

  • పదో రోజుకు చేరుకున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం
  • మాతృభూమిని కాపాడుకోవడానికి విదేశాల నుంచి వచ్చారన్న మంత్రి  
  • విద్యార్థుల తరలింపుకు బస్సులను ఏర్పాటు చేశామన్న ఇండియన్ ఎంబసీ 
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం పదో రోజుకు చేరుకుంది. వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు ఆయుధాలు చేతబట్టి మాతృదేశం కోసం యుద్ధంలో పోరాడుతున్నాడు. మరోవైపు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ కీలక ప్రకటన చేశారు.

రష్యాపై పోరాడేందుకు 66,224 మంది ఉక్రెయిన్ జాతీయులు విదేశాల నుంచి తిరిగొచ్చారని అన్నారు. తమ మాతృభూమిని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ పౌరులు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. మరోవైపు ఖార్ఖివ్ లో ఉన్న 298 మంది విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశామని ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది.


More Telugu News