పోలవరంపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం: వైసీపీ ఎంపీ మార్గాని భరత్
- పోలవరాన్ని బ్యారేజీ స్థాయికి దిగజారుస్తున్నారన్న చంద్రబాబు
- చంద్రబాబు వ్యాఖ్యలపై మార్గాని రివర్స్ అటాక్
- తాము కడుతున్నది ప్రాజెక్టేనని వెల్లడి
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య మరో అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. నిన్నటిదాకా ఇరు పార్టీల మధ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగగా... తాజాగా ఆ పార్టీలకు చెందిన నేతల మధ్య పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరింది.
పోలవరం ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా పరిగణించి భారీ ప్రాజెక్టుగా రూపుదిద్దితే.. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును కాస్తా బ్యారేజీ స్థాయికి ప్రభుత్వం కుదించే యత్నాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వాదనపై శనివారం నాడు వైసీపీ యువ నేత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ రివర్స్ అటాక్ చేశారు.
తమ ప్రభుత్వం పోలవరాన్ని ప్రాజెక్టుగానే నిర్మిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును బ్యారేజీ మాదిరిగా కుదించేయాలని టీడీపీ యత్నించిన కారణంగానే పోలవరం మాట గుర్తుకు వస్తేనే చంద్రబాబు బ్యారేజీ మాట అందుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలవరాన్ని తాము ప్రాజెక్టుగానే కడుతున్నామని చెప్పిన భరత్.. దీనిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.