వివేకాను హత్య చేసింది ఎవరో సీబీఐకి తెలుసు: బీటెక్ రవి

  • వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ
  • సంచలనం సృష్టించిన వాంగ్మూలాలు
  • రాజకీయ పక్షాల పరస్పర విమర్శలు
  • నిందను టీడీపీపై ఎందుకు మోపుతారన్న బీటెక్ రవి
  • కేసును చంద్రబాబుకు చుట్టడం సరికాదని హితవు
వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ అత్యంత కీలకదశలో ఉంది. సంచలన వాంగ్మూలాలతో కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. వివేకా హత్య కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని గుర్తుచేశారు. పూర్తి విషయాలు బహిర్గతం అయ్యాక కూడా టీడీపీ నేతలను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ వైసీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. 

సీబీఐ విచారించాక కూడా ఆ నిందను టీడీపీకి ఆపాదించడం ఏంటని ఆగ్రహం వెలిబుచ్చారు. వివేకా హత్య కేసును చంద్రబాబుకు చుట్టడం సరికాదని స్పష్టం చేశారు. సీబీఐకి వైఎస్ కుటుంబంపై ఏమైనా కక్ష ఉంటుందా? అని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసని అన్నారు.  

అంతేకాదు, వివేకాను హత్య చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని కూడా అన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేనందునే విచారణకు పిలవలేదని వివరించారు.


More Telugu News