వివేకా హత్య కేసులో జగన్ పేరు కూడా చేర్చాలి: యనమల
- వివేకా హత్య కేసులో జగన్ ప్రధాన భాగస్వామి
- అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో వైసీపీ నేతలకు తెలియదు
- రాజధానిపై మరో చట్టం తీసుకురావడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది
పక్కా ప్లాన్ తోనే వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ కుట్రలో జగన్ ప్రధాన భాగస్వామి అని ఆరోపించారు. నిందితుల జాబితాలో వైయస్ అవినాశ్ రెడ్డితో పాటు జగన్ పేరును కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారనే విషయాన్ని ఆయన కుమార్తె సునీత సీబీఐకి తన వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో వైసీపీ నేతలకు తెలియదని అన్నారు. రాజధాని గురించి మరో చట్టం చేసినా కోర్టులో ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావడానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని అన్నారు.
రాజ్యంగానికి లోబడే శాసనసభ చట్టాలు చేయాలని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయకూడదని యనమల చెప్పారు. చట్ట సభల్లో తమకు బలం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంలో తప్పేమీ లేదని... వైసీపీకి అధికారం బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచనా బలం లేదని ఎద్దేవా చేశారు.