గురుకులంలో పాముకాటుకు విద్యార్థి బలి.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్
- కురుపాం గురుకుల పాఠశాలలో ఘటన
- ముగ్గురు విద్యార్థులను కరిచిన కట్లపాము
- ఘటనపై సీఎం దిగ్ర్భాంతి
విజయనగరం జిల్లా కురుపాంలో విషాదం చోటు చేసుకుంది. గురుకుల హాస్టల్ లో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసింది. మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన రంజిత్ కుమార్ అనే 8వ తరగతి విద్యార్థి చనిపోయాడు.
సాలూరు మండలం జీగిరాంకు చెందిన ఈదుబిల్లి వంశీ, సీతానగరం మండలం జగ్గునాయుడుపేటకు చెందిన వంగపండు నవీన్ లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆ ముగ్గురిని కట్ల పాము ముక్కు, కన్ను, వీపుల మీద కరిచినట్టు విద్యార్థులు చెప్పారు. కాగా, రంజిత్ మరణవార్తతో అతడి తల్లిదండ్రులు బోరున విలపించారు.
కాగా, ఘటన గురించి సీఎం జగన్ కు మంత్రులు పుష్పశ్రీవాణి, వేణుగోపాలకృష్ణలు వివరించారు. విద్యార్థి మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి ఆ పరిహారాన్ని అందజేయనున్నారు.