ధైర్యంగా ఉండండి.. అన్ని చర్యలు చేపడుతున్నాం: విద్యార్థులకు భారత ఎంబసీ సూచన

  • తమను కాపాడాలంటూ భారత విద్యార్థుల వినతులు
  • సామాజిక మాధ్యమాలపై పోస్ట్ లు
  • తరలింపు ప్రయత్నాల్లో ఉన్నామంటూ అధికారుల రిప్లయ్
తమను కాపాడాలంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వినతులకు ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ అధికారులు స్పందించారు. అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నామంటూ, ధైర్యంగా ఉండాలని కోరారు. ఖర్కీవ్ లో 300 మంది, సుమీలో 700 వరకు భారత విద్యార్థులు చిక్కుకున్నట్టు అధికారుల అంచనా. 

‘‘సుమీ నుంచి భారత పౌరులను సురక్షితంగా, భద్రంగా తరలించేందుకు  అన్ని మార్గాల్లోనూ సాధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాం. తరలింపు, బయటపడే మార్గాల గుర్తింపు విషయమై సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. పౌరులు అందరినీ తరలించడం పూర్తయ్యే వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంటుంది. సురక్షితంగా ధైర్యంగా ఉండండి’’ అని ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.


More Telugu News