ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టేసే రష్యా అణ్వాయుధ బ్రహ్మాస్త్రం ‘డెడ్ హ్యాండ్’.. రష్యాపై దాడి జరిగితే ఆటోమేటిక్ గా ప్రయోగం
- అణుయుద్ధమంటూ పదే పదే కవ్విస్తున్న రష్యా
- నిన్న అణువిద్యుత్ కేంద్రంపై దాడి నేపథ్యంలో డెడ్ హ్యాండ్ పై చర్చ
- ప్రచ్ఛన్న యుద్ధం టైంలో తయారు చేసిపెట్టుకున్న రష్యా
- 1970ల్లో తయారీ.. 1985 నుంచి వినియోగానికి రెడీ
ఊ అంటే అణుదాడి తప్పదంటూ రష్యా పదేపదే హెచ్చరికలు చేస్తోంది. అంతేకాదు.. మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది అణుయుద్ధమే అవుతుందని ఇటీవలే ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు కూడా. మరోపక్క, ఉక్రెయిన్ లో అణు కేంద్రాలపైనా రష్యా దాడులు చేస్తోంది.
ఇదంతా పక్కన పెడితే.. రష్యా దగ్గర వున్న ఓ భయంకరమైన ఆయుధం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టేసే ఆ బ్రహ్మాస్త్రం పేరు ‘డెడ్ హ్యాండ్’ అలియాస్ ‘పెరిమీటర్’. అణు విద్యుత్ కేంద్రంపై దాడి నేపథ్యంలో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది.
ప్రపంచ పటంలో రష్యా అన్నది ఉండకుంటే మరే దేశమూ ఉండకూడదన్న లక్ష్యంతో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో రష్యా ఆ ఆయుధాన్ని తయారు చేసి పెట్టుకుంది. ఒకవేళ జరగరానిది జరిగి.. రష్యా నాశనమైతే ఆటోమేటిక్ గా రష్యాలోని అణ్వాయుధాలను యాక్టివేట్ చేసే శక్తి దాని సొంతం. అన్నింటికి ఆర్డర్స్ పాస్ చేసి అణ్వాయుధాలను లాంచ్ చేస్తుంది. ప్రపంచ వినాశనాన్ని శాసిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏకైక వినాశకర ఆటోమేటిక్ అణ్వస్త్ర వ్యవస్థ ఇది. ఇది ఉన్నట్టు ప్రపంచానికి తెలిసింది 2011లోనే. అప్పటి రష్యా కమాండర్ సెర్గీ కరాకయీవ్ దాని గురించి అధికారికంగా ప్రకటించారు. కొన్నేళ్ల క్రితమే దానిని రష్యా అప్ గ్రేడ్ చేసినట్టు తెలుస్తోంది. అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు కమాండ్లు ఇచ్చేలా ఇందులో 700 వెహికల్స్ ఉన్నట్టు చెబుతారు.
మాస్కోలోని భూగర్భ బొరియల్లో దానిని దాచారని చెబుతున్నా.. అదెక్కడ ఉందన్నది ప్రపంచానికి తెలియని విషయమే. శత్రు దేశాలు రష్యాపై దాడి చేసినా.. అత్యున్నత స్థాయి అధికారులు దానికి ఆదేశాలు జారీ చేయలేకపోయినా.. తనంతట తానే ఆయుధ వ్యవస్థను ఇది యాక్టివేట్ చేస్తుంది.
అణ్వాయుధ ప్రయోగం జరిగినప్పుడు రేడియేషన్ స్థాయులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్ల ద్వారా లెక్కగట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేసి డెడ్ హ్యాండ్ ఆదేశాలను ఇస్తుంది. ప్రపంచంలోని నలుమూలలా ఉన్న రష్యా గూఢచారులు, సైనికాధికారులకు సూచనలిస్తుంది. ఒకవేళ వాళ్ల నుంచి ఎలాంటి రిప్లై రాకపోతే.. కొంత సేపు వేచి చూసి తనే ఆటోమేటిక్ గా ఆర్డర్స్ ఇచ్చేస్తుంది.
ఆ వ్యవస్థ మొత్తం గాల్లోకి లేచి దానికి అనుసంధానించిన వివిధ ప్రాంతాల్లోని అణ్వస్త్రాలకు ప్రయోగ కమాండ్లను ఇస్తుంది. ఆ కమాండ్లను తీసుకుని అణ్వస్త్రాలు ఆటోమేటిక్ గా గాల్లోకి లేచి టార్గెట్ ను ధ్వంసం చేస్తాయి. కాగా, 1970ల్లో దీనిని సోవియట్ యూనియన్ తయారు చేసింది. 1984లో బైలోరష్యన్ నుంచి పరీక్షించింది. అక్కడి నుంచి పైకి లేచిన క్షిపణి కజకిస్థాన్లోని బైకనూర్ వద్ద ఉన్న అణు క్షిపణికి ఆర్డర్స్ ను ఇచ్చింది. టార్గెట్ ను ఛేదించింది. దీంతో 1985లో దానిని రష్యా వినియోగానికి రెడీగా పెట్టుకుంది. వ్లాదిమిర్ యరినిచ్ అనే వ్యక్తి దీనికి రూపకల్పన చేశాడు.
వాస్తవానికి 1967లోనే సిగ్నల్ అనే ఓ వ్యవస్థను రూపొందించేందుకు సోవియట్ యూనియన్ ప్రయత్నించింది. దాని ప్రకారం ఒకేసారి 30 క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా ముందస్తు ఆదేశాలతో దానిని రూపొందించేందుకు ప్రయత్నించారు. అయితే, అది పూర్తిగా ఆటోమేటిక్ కాదు.