తుపాను అలర్ట్... తీరం వైపు కదులుతున్న వాయుగుండం

  • గంటకు 13 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం
  • తమిళనాడుకు భారీ వర్ష సూచన
  • రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు 
ఈ వేసవిలో తొలి తుపాను ముంచుకొస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. గత 6 గంటల నుంచి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఇది తీరంవైపు కదులుతోంది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం తమిళనాడులోని నాగపట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయింది. 

ఇక ఇది పూర్తిగా దిశను మార్చుకుని తమిళనాడు వైపు రానుంది. వాయుగుండం కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో భారీ వర్షాలు పడచ్చని హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News