ఎంసీజీ గ్రేట్ సదరన్ స్టాండ్ కు షేన్ వార్న్ పేరు

  • గుండెపోటుతో షేన్ వార్న్ మృతి
  • స్టాండ్ కు పేరు పెడుతున్నట్టు ప్రకటించిన విక్టోరియన్ స్పోర్ట్స్ మినిస్టర్
  • టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్
ప్రపంచం గర్వించదగ్గ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. 52 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు. మరోవైపు షేన్ వార్న్ జ్ఞాపకార్థం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లోని గ్రేట్ సదరన్ స్టాండ్ కు షేన్ వార్న్ పేరు పెడుతున్నారు. ఈ విషయాన్ని విక్టోరియన్ క్రీడలశాఖ మంత్రి మార్టిన్ తెలిపారు. 

1990 దశకం తొలి నాళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షేన్ వార్న్ 2007లో రిటైర్ అయ్యారు. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర పుటలకెక్కారు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1,347) పేరిట ఉంది.


More Telugu News