‘ఆపరేషన్ గంగ’ వల్ల లోకాన్ని చూడబోతున్న పసికందు.. అదే పేరు పెట్టాలని తండ్రి నిర్ణయం

  • కీవ్ లో చిక్కుకుపోయిన కేరళ కుటుంబం
  • భారత ఎంబసీ అధికారుల సాయంతో పోలండ్ చేరిక
  • 9 నెలల గర్భంతో ఉన్న మహిళ
  • ఆసుపత్రికి తరలింపు.. మార్చి 26న ప్రసవం
  • పుట్టే బేబీకి ‘గంగ’ నామకరణం
భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం వల్ల కేరళకు చెందిన ఓ కుటుంబం ఉక్రెయిన్ నుంచి క్షేమంగా బయటపడింది. ఆ దంపతులు ఓ బేబీకి అతి త్వరలో జన్మనివ్వబోతున్నారు.  పుట్టే బేబీకి గంగ పేరు పెట్టుకోవాలని తండ్రి నిర్ణయించుకున్నాడు.

కేరళకు చెందిన అభిజిత్, ఆయన భార్య.. ఉక్రెయిన్ లోని కీవ్ లో చిక్కుకుపోయారు. భారత రాయబార కార్యాలయం సిబ్బంది సాయంతో వారు ఎట్టకేలకు కీవ్ నుంచి పోలండ్ కు చేరుకున్నారు. పోలండ్ లో భారత ఎంబసీ ఏర్పాటు చేసిన షెల్టర్ కు వెళ్లిపోయారు. దీని పట్ల అభిజిత్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

‘‘నా భార్య పోలండ్ లోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు తొమ్మిది నెలలు. తల్లి, గర్భంలోని శిశువు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారన్న సమాచారం నాకు అందింది. మార్చి 26న నా భార్య శిశువుకు జన్మనివ్వనుంది. దీంతో సహాయక కార్యక్రమం పేరునే బేబీకి పెట్టుకోవాలని నిర్ణయించాను’’అని అభిజిత్ తెలిపాడు. 

తాను భారత్ కు వస్తున్నానని, తన భార్య ఆస్పత్రిలోనే ఉంటుందని చెప్పాడు. కీవ్ లో అభిజిత్ ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నాడు.


More Telugu News