ఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చిన ఆ ఆయుధాలతో రష్యాకు భారీ నష్టం
- ఉక్రెయిన్ కు అమెరికా జావెలిన్ క్షిపణులు
- వీటి సాయంతో చెలరేగిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
- రష్యా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలపై దాడి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. తెర వెనుక చేయాల్సినంతా చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ కు అత్యాధునిక, శక్తిమంతమైన ఆయుధాలు సమకూరుస్తోంది. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ సైనికులు రష్యాకు భారీ నష్టం కలిగిస్తున్నారు. వందలకొద్దీ యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేస్తూ, శుత్రు సేనలపై పైచేయి సాధిస్తున్నారు.
ఉక్రెయిన్ కు అమెరికా జావెలిన్ మిసైల్స్ ను సరఫరా చేసింది. ఇవి భుజాన పెట్టుకుని ప్రయోగించడానికి అనువైన క్షిపణులు. భూతలం నుంచి భూతలం, గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. వీటి సాయంతో ఉక్రెయిన్ సైనికులు ఇప్పటి వరకు కనీసం 300 వరకు రష్యా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 93 శాతం ఇవి కచ్చితత్వాన్ని చూపిస్తున్నట్టు స్థానిక వార్తా కథనాల ఆధారంగా తెలుస్తోంది.
అయితే, రష్యా యుద్ధం మొదలైన తర్వాతే అమెరికా జావెలిన్ మిసైల్స్ ను సరఫరా చేసిందని అనుకోవడానికి లేదు. చాలా ముందుగానే 2018లోనే మొదటి విడత సరఫరా చేసింది. తాజాగా యుద్ధం మొదలైన తర్వాత అదనపు సరఫరాలతో చేదోడుగా నిలిచింది. 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు.