ప్రైవేటు పాఠశాలల్లో చదివేవారికి అమ్మఒడి పథకం ఎందుకు?:వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
- డబ్బులున్నవారే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతారు
- వారికి అమ్మఒడి ఇవ్వడం అనవసరం
- ఐసీడీఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది
ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమలుపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. డబ్బులున్నవారే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతారని... వారికి ఈ పథకం కింద డబ్బులు ఇవ్వడం అనవసరమని చెప్పారు.
మరోవైపు కడప జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. సూపర్ వైజర్ల బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని... ఎవరు డబ్బులిస్తే వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా సరైన పర్యవేక్షణ కూడా లేదని అన్నారు.