శరీరంలో రూ. 6 కోట్ల విలువైన హెరాయిన్ దాచుకున్న మహిళ.. 12 రోజులు కష్టపడి వెలికి తీసిన వైద్యులు
- సూడాన్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మహిళ
- శరీరంలో పెద్ద ఎత్తున హెరాయిన్ క్యాప్సూల్స్ ఉన్నట్టు గుర్తింపు
- గత నెల 19 నుంచి మార్చి 2వ తేదీ వరకు క్యాప్సూల్స్ వెలికితీత
శరీరంలో 6 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సూల్స్ దాచుకుని స్మగ్లింగ్ చేస్తూ దొరికిన మహిళ నుంచి వాటిని వెలికి తీసేందుకు ఏకంగా 12 రోజులు పట్టింది. రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. సూడాన్ నుంచి గత నెల 19న జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మహిళ ప్రవర్తన అనుమానంగా ఉండడంతో తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు.. శరీరంలో 6 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ క్యాప్సూల్స్ దాచుకున్నట్టు గుర్తించారు.
వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం ఆసుపత్రిలో చేర్చారు. నాటి నుంచి ఈ నెల 2వ తేదీ వరకు వైద్యులు శ్రమించి శరీరంలో దాచుకున్న హెరాయిన్ క్యాప్సూల్స్‌ను వెలికి తీశారు. నిందితురాలు బుధవారం డిశ్చార్జ్ కాగా ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.