అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ అమెరికాలో సంబరాలు
- కేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్న ప్రవాసాంధ్రులు
- హైకోర్టులో పిటిషన్ వేసింది తానేనన్న మన్నవ సుబ్బారావు
- ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెట్టిందని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికాలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రవాసాంధ్రులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రవాసాంధ్రుడు మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది తానేనన్నారు. తాను పిటిషన్ వేయడాన్ని జీర్ణించుకోలేని ఏపీ ప్రభుత్వం తనపై లేనిపోని కేసులు పెట్టిందని అన్నారు. ప్రవాసాంధ్రుడు భానుప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలోనే కాకుండా, కోర్టులోనూ అమరావతి గెలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.