ఆంక్ష‌ల‌తో ర‌ష్యాకే లాభ‌మ‌ట‌.. పుతిన్ కొత్త థియ‌రీ!

  • ర‌ష్యాతో సంబంధాలు కొన‌సాగించండి
  • ఆంక్ష‌లు విధించాల్సిన అవ‌స‌ర‌మేమీ లేదు
  • ఏక‌ప‌క్షంగా ఆంక్ష‌లు విధిస్తే వారికే న‌ష్టమన్న పుతిన్  
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్ర‌పంచ దేశాల‌కు వార్నింగ్‌ల‌తో పాటు ఇప్పుడు స‌రికొత్త థియ‌రీల‌ను చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని బూచిగా చూపి త‌మ‌పై దండెత్తి వ‌స్తే అణు బాంబుల‌ను సంధించ‌డానికి కూడా వెనుకాడేది లేదంటూ ఇటీవ‌లే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన పుతిన్‌.. తాజాగా త‌మ దేశంతో సంబంధాల‌ను కొన‌సాగించాల్సిందేన‌ని కోరారు.

ర‌ష్యాతో సంబంధాల‌ను తెంచుకోవ‌డ‌మో, లేదంటే త‌మ దేశంపై ఆంక్ష‌లు విధించడ‌మో చేస్తే.. అది ఆయా దేశాల‌కు కాకుండా ర‌ష్యాకే లాభిస్తుంద‌ని కూడా పుతిన్ కొత్త థియ‌రీ చెప్పారు. వివిధ దేశాల ఆంక్ష‌ల కార‌ణంగా ర‌ష్యాకే ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ర‌ష్యాకు దురుద్దేశాలు లేవ‌ని చెప్పిన పుతిన్‌..త‌మ దేశంపై ఆంక్ష‌లు విధించాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌న్నారు. ర‌ష్యాకు స‌హ‌క‌రించ‌కూడ‌ద‌ని ఎవ‌రైనా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటే.. అది వారికే న‌ష్టం క‌లిగిస్తుంద‌ని కూడా పుతిన్ చెప్పుకొచ్చారు.


More Telugu News