తెలంగాణలో కొత్తగా 152 మందికి కరోనా... తాజా బులెటిన్ ఇదిగో!

  • గత 24 గంటల్లో 30,146 కరోనా కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 58 కొత్త కేసులు
  • ఇంకా 2,164 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 30,146 శాంపిల్స్ పరీక్షించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 58 కొత్త కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో 374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా....7,83,278 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,164 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.
.


More Telugu News