భయమెందుకు? నేనేమీ కొరకనులే!: పుతిన్‌పై జెలెన్‌స్కీ అదిరేటి కామెంట్!
- దేశాల ప్రతినిధుల చర్చలతో ఒరిగేదేమీ లేదన్న జెలెన్ స్కీ
- ముఖాముఖీగా మనమే మాట్లాడుకుందామని పుతిన్‌కు ప్రతిపాదన
- చర్చల్లో దూరంగా కాకుండా దగ్గరగా కూర్చుందామని వ్యాఖ్య
- తానేమీ చేయనని, ఇంకెందుకు భయపడతారని సెటైర్లు
ఓ వైపు తమ దేశంపైకి రష్యా భీకర దాడులతో దండెత్తి వస్తున్నా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఎప్పటికప్పుడు తనదైన శైలి విమర్శలతో జెలెన్‌స్కీ విరుచుకుపడుతూనే ఉన్నారు. రష్యా దురాక్రమణపై నిప్పులు చెరుగుతున్న జెలెన్‌స్కీ.. పుతిన్ దురాక్రమణ వాదంపై గళం విప్పాలని ఏకంగా రష్యన్లకే పిలుపునిచ్చి తనదైన మార్కును చాటుకున్నారు.
తాజాగా ఇరు దేశాల ప్రతినిధులు కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, యుద్ధం ముగియాలంటే పుతిన్, తాను ముఖాముఖీగా చర్చలు జరపాలని జెలెన్ స్కీ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తనతో చర్చలకు వస్తే తానేమీ కొరకనులే అంటూ పుతిన్‌పై ఓ సెటైరికల్ కామెంట్ చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలెట్టి శుక్రవారం నాటికి సరిగ్గా తొమ్మిది రోజులు అవుతోంది. రోజురోజుకు దాడుల తీవ్రతను పెంచుతూ పోతున్న రష్యాకు ఉక్రెయిన్ నుంచి కూడా భారీగానే దెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి క్రమంలో రష్యా ప్రతిపాదించిన చర్చలకు ఉక్రెయిన్ సమ్మతించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండు విడతలుగా చర్చలు జరిగాయి. అయితే సామాన్య పౌరులను, ఉక్రెయిన్‌లోని ఇతర దేశస్తులను సురక్షితంగా తరలించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినా.. యుద్దం ఆగే దిశగా మాత్రం ఇప్పటిదాకా ముందడుగు పడలేదు.
గురువారం నాడు ఇరు దేశాల మధ్య రెండో విడత జరుగుతున్న చర్చల సందర్భంగా పుతిన్‌ను ఉద్దేశించి జెలెన్ స్కీ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ‘‘మనిద్దరం కలిసి అన్ని విషయాలూ ఫేస్ టూ ఫేస్ చర్చించుకుందాం. 30 మీటర్ల దూరంలో కూర్చుని మాత్రం కాదు. నేనేమీ కొరకను. మరింకెందుకు భయం?’’ అంటూ జెలెన్ స్కీ కామెంట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో పుతిన్ చర్చల సందర్భంగా పొడవైన టేబుల్‌కు చెరోవైపున కూర్చోవడాన్ని ఉద్దేశించి ఆయన ఇలా చురకలు వేసినట్టుగా తెలుస్తోంది.