ప్రభాస్ సరసన ఆ ముగ్గురు భామలు ఎవరబ్బా?
- రిలీజ్ కి సిద్ధమైన 'రాధేశ్యామ్'
- సెట్స్ పై ఉన్న 'సలార్' .. 'ప్రాజెక్టు K'
- లైన్లో ఉన్న మారుతి
- త్వరలో సెట్స్ పైకి 'రాజా డీలక్స్'
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధేశ్యామ్' రెడీ అవుతోంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక 'ఆది పురుష్' షూటింగు పూర్తిచేసుకోగా, 'సలార్' .. 'ప్రాజెక్టు K' షూటింగు దశలో ఉన్నాయి. 'ప్రాజెక్టు K'లో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనుండటం అందరిలో ఆసక్తిని రేపుతున్న అంశం.
ఇక ఈ సినిమా తరువాత ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేయవలసి ఉంది. అయితే ఆ సినిమాకంటే ముందుగా ఆయన మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వినోద ప్రధానమైన కథాంశంతో ఈ సినిమా డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతుందని అంటున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడట. ఆ ముగ్గురు ముద్దుగుమ్మలను ఆల్రెడీ ఎంపిక చేశారని, అలాగే సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని అంటున్నారు. 'రాధేశ్యామ్' విడుదలైన 2వ వారంలో ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం.