టీడీపీ నుంచి వచ్చిన వాళ్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు: రేవంత్ పై వీహెచ్ ఫైర్
- ఇంతకాలం పార్టీ కోసం పని చేసిన వాళ్లు ఏం కావాలి?
- పొన్నాల వంటి వారిని కూడా పక్కన పెడుతున్నారు
- అధిష్ఠానానికి చెబుదామంటే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లను మాత్రమే రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. ఇలాగైతే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారంతా ఏం కావాలని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్య వంటి కీలక నేతలను కూడా పక్కన పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. అందుకే మీడియాతో ఈ విషయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు.
మరోవైపు తెలంగాణను బీహార్ ఐఏఎస్ అధికారులే ఏలుతున్నారంటూ రేవంత్ ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. ఒక ప్రాంతం వారిని విమర్శించడం మంచి పద్ధతి కాదని అన్నారు. బీహార్ లో తెలంగాణ వాళ్లు పని చేయడం లేదా? అని అడిగారు. ఏపీ అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారని, వాళ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.