మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు
- కలకలం రేపిన మంత్రి హత్యకు కుట్ర
- మంత్రికి భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ నిర్ణయం
- ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయనున్నట్లు వెల్లడి
తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను రెట్టింపు చేసింది. మంత్రి హత్యకు కుట్ర జరిగిందని, ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు ఆయనను హత్య చేసేందుకు హంతక ముఠాకు రూ.15 కోట్ల మేర సుపారీ ఇచ్చేందుకు సిద్ధపడిన వైనాన్ని సైబరాబాద్ పోలీసులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ అమలుకు ముందే బయటపడటంతో మంత్రికి పెను ముప్పే తప్పింది. మంత్రి హత్యకు కుట్ర, తదనంతర పరిణామాలను పరిశీలించిన ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా శ్రీనివాస్ గౌడ్‌కు భద్రతను పెంచాలని నిర్ణయించింది.
ఇంటెలిజెన్స్ వర్గాల సమీక్షలో మంత్రికి ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ టూర్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట శ్రీనివాస్ గౌడ్ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట శ్రీనివాస్ గౌడ్ కూడా శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రానికి చేరుకోనున్నారు. రాష్ట్రానికి చేరుకున్న మరుక్షణమే ఆయనకు కల్పిస్తున్న భద్రతను రెట్టింపు చేయనున్నట్లుగా ఇంటెలిజెన్స్ తెలిపింది.