సీఎం జగన్ పోలవరం పర్యటనలో పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని... వీడియో ఇదిగో!
- కేంద్రమంత్రితో కలిసి పోలవరం వెళ్లిన సీఎం జగన్
- పర్యటనలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి పేర్ని నాని
- పేర్ని నాని కారు తొలగించాలన్న పోలీసులు
- పోలీసులపై నిప్పులు చెరిగిన మంత్రి పేర్ని నాని
- ఏం... తమాషాగా ఉందా? అంటూ ఫైర్
ఏపీ సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని నాని కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ సిబ్బంది పేర్ని నాని వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడమే ఆయన ఆగ్రహానికి కారణం.
"మంచీ మర్యాదా ఉండక్కర్లా... ఎవరి డిజిగ్నేషన్ ఏంటో తెలియదా? ఈ కార్లు ఎవరివి? ఇది ఎవరి కారు? తమాషాలు చేస్తున్నారా? కారు తీయమన్నది ఎవరూ? ఏం తమాషాగా ఉందా? ఎవరి కారు నువ్వు తీయమన్నది? గుర్తుపెట్టుకో... నేను ఇన్చార్జి మంత్రిని! ఇవాళతో పండుగ అయిపోదు" అంటూ నిప్పులు చెరిగారు.
ఓ పోలీసు అధికారి మంత్రి పేర్ని నానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. "మా సారు చెప్పింది మీకు చెప్పాం" అని ఆ అధికారి తెలిపారు. అయినప్పటికీ మంత్రి పేర్ని నాని శాంతించలేదు సరికదా, మరింత ఆవేశానికి లోనయ్యారు. "ఏయ్... ఒకడు చెప్పేదంటయ్యా! మీ ఎస్పీ కారు, డీఐజీ కారు ఇక్కడెందుకు ఉంటాయ్?" అంటూ మండిపడ్డారు.
దాంతో ఆ అధికారి... "మా ఉన్నతాధికారులు వస్తున్నారు సార్" అంటూ మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా మంత్రి పేర్ని నాని కోపం తగ్గలేదు. "వస్తే రమ్మను... నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్లు తక్కువ వాళ్లు... మర్యాదగా ఉండదు" అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.