చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించాను: హీరో సూర్య
- చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నారు
- దీంతో నేనూ ‘అగరం’ పేరిట ఫౌండేషన్ స్థాపించాను
- ఆ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నానన్న సూర్య
సౌతిండియా స్టార్ హీరో సూర్య కొత్త సినిమా 'ఈటీ' వచ్చేవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగువాళ్లలో ఒకడిగా భావిస్తున్నానని చెప్పాడు. తెలుగు ప్రేక్షకులను కలిసి దాదాపు రెండేళ్లవుతోందని తెలిపాడు. తన ఫ్యాన్స్‌కు, ఈటీ సినిమా బృందానికి థ్యాంక్స్ చెప్పాడు.
స్వచ్ఛంద సేవా రంగంలో మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా సూర్య అన్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవల నుంచి స్ఫూర్తి పొందానని, అందుకే తాను ‘అగరం’ పేరిట ఫౌండేషన్‌ను స్థాపించానని చెప్పారు. ఆ ఫౌండేషన్ ద్వారా తాను సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.