హీరో మోటో నుంచి తొలి ‘విదా’ ఎలక్ట్రిక్ టూ వీలర్.. చిత్తూరు ప్లాంట్ లో తయారీ

  • విదా బ్రాండ్ ఆవిష్కరణ
  • ఈ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ
  • ప్రకటించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్
హీరో గ్లామర్, స్పెండర్, పాషన్ పేరుతో దేశ ప్రజలు అందరికీ పరిచయమైన హీరో మోటోకార్ప్.. విదా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. ఇందుకు సంబంధించి విదా బ్రాండ్ ను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ కింద తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని జూలై 1న విడుదల చేయనుంది. దీనిని చిత్తూరు ప్లాంట్ లో తయారు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 

ఈ ఏడాది చివరి నుంచి కస్టమర్లకు వాహనాలను అందించనుంది. 100 మిలియన్ డాలర్ల సస్టెయినబుల్ ఫండ్ ను హీరోమోటో కార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ ఈ సందర్భంగా ప్రకటించారు. దీని కింద 100 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హీరో ఎలక్ట్రిక్ కింద ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయమవుతుండడం తెలిసిందే. ఈ బ్రాండ్ పవన్ ముంజాల్ సోదరులైన నవీన్ ముంజాల్, విజయ్ ముంజాల్ కు చెందినది.


More Telugu News